- వరంగల్ ఎంపీ ఆస్పిరేంట్ రామకృష్ణ
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
టీపీసీసీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డిని వరంగల్ ఎంపీ ఆస్పిరెంట్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ శనివారం మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ..మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వేం నరేందర్ రెడ్డిని కలవడం సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వేం నరేందర్ రెడ్డి ఎంతో కృషి చేశారని కొనియాడారు. వేం నరేందర్ రెడ్డి పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాల మీద..ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తి రామకృష్ణ అని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగు బాప్టిస్ట్ కన్విన్షన్ డాక్టర్ జోసెఫ్ ప్రభాకర్, డాక్టర్ టీ సామ్ ఎంవీ లాజరస్, బండారి మధుకూడా..నరేందర్ రెడ్డి ని కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.