వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి :
నరేంద్ర మోదీ..రాహుల్ గాంధీల కులం తెలియాలంటే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.మిర్యాలగూడలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కన్వర్టెడ్ బీసీ అని కాంగ్రెస్ వారు అంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీది ఏ కులమో చెప్పాలని బిజెపి వారు అంటున్నారని, ఈ రెండు పార్టీ వాళ్లు ఒకరికి ఒకరు సవాల్ విసిరుకోవడం ఆపేసి నిజంగా దేశ ప్రజలకు వాస్తవాలు తెలవాలంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే అధికారికంగా దేశవ్యాప్తంగా కులగణన చేపడితే మోదీ,రాహుల్ గాంధీల కూలమెంటో అధికారికంగా తెలుస్తుందని అన్నారు.నిజంగా బిజెపి పార్టీకి రాహుల్ గాంధీ కులం ఏమిటో తెలుసుకోవాలనీ ఉంటే ఈ పని చేయాలని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు బీసీలపై నిజంగా ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు కృషి చేయాలని లింగంగౌడ్ డిమాండ్ చేశారు.