వేద న్యూస్, ఓరుగల్లు:

హన్మకొండ జిల్లా పర్యటనకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదివారం కేటీఆర్ సేన వరంగల్ జిల్లా అధ్యక్షుడు నరేశ్ మైనాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేశ్‌ను కేటీఆర్ అభినందించారు.

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్టు నరేశ్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ కేటీఆర్, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ పార్టీ నాయకత్వమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని నరేశ్ వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. గ్యారంటీలు, హామీల పేరిట జనాన్ని వంచించిన కాంగ్రెస్‌కు త్వరలో గుణపాఠం ఖాయమని హెచ్చరించారు.