వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట:
రాష్ట్రంలో ప్రజల వద్దకే పాలన వచ్చిందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. శనివారం ఆయన నర్సంపేట పట్టణంలో ‘ప్రజా పాలన’ అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సంపేట మున్సిపాలిటీ 6, 7వ వార్డులలో ప్రజలు దరఖాస్తులు సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రభుత్వం ‘ప్రజా పాలన’-ప్రజల వద్దకే తీసుకొచ్చిందని చెప్పారు. సమాచారాన్ని సేకరించి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలను అందించాలని అధికారులకు సూచించారు. ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.