వేద న్యూస్, నర్సంపేట:
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఓ అవ్వ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అది చూసి జనం సంతోషం వ్యక్తం చేశారు. తమ నాయకుడు ప్రజా నాయకుడని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పేర్కొన్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శనివారం ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా నర్సంపేట పట్టణంలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ వృద్ధురాలు ఎమ్మెల్యే వద్దకు రాగా, దొంతి ఆమెను ఆప్యాయంగా ‘అవ్వా బాగున్నావా’ అని పలకరించారు. ఈ క్రమంలోనే సదరు అవ్వ ఎమ్మెల్యేను ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఎమ్మెల్యే దొంతి హామీనిచ్చారు. అందరి క్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే దొంతి స్పష్టం చేశారు. సదరు వృద్ధురాలి యోగక్షేమాలు ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.