పార్టీలకు అతీతంగా కాలనీల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నాం…

గతంలో కాంగ్రెస్ ప్రతినిధులకు కేటాయించిన నిధుల పై చర్చకు సిద్ధం…

18 నెలల్లో 4 వ డివిజన్ లోనె సుమారు 4 .5 కోట్ల మేర నిధులు కేటాయింపు

4వ డివిజన్ లో సీసీ రోడ్డు మరియు సైడ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని…

వేద న్యూస్, హన్మకొండ:

ప్రజా పాలనలో భాగంగా గెలిచిన నాటి నుంచి ప్రతి రోజు రెండు డివిజన్ లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి శుక్రవారం రోజున 4 వ డివిజన్ లోని జ్యోతి బసు నగర్ లో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును మరియు అక్షర కాలనీలో కాలనీ నుంచి ప్రధాన రోడ్డు వరకు రూ.49.90 లతో రోడ్డు నూతన సీసీ రోడ్డు పనులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
నాయిని రాజేందర్ మాట్లాడుతు ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారమే లక్ష్యం ప్రభుత్వం మేము పనిచేస్తున్నాం..
GWMC,KUDA సహకారంతో అన్ని కాలనీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
శంకుస్థాపన చేసిన అనతికాలంలో పనులు ప్రారంభం చేసేలా చిత్త శుద్ధితో పనిచేస్తున్నాం.
కేవలం గడిచిన 18 నెలల్లో ఒక్క 4 వ డివిజన్ లలో 4.50 కోట్లు కేటాయించినం.
విషయ పరిజ్ఞానం లేని వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుతున్నారు.
అన్ని డివిజన్ లలో మాపై నమ్మకంతో ఓటు వేశారు అభివృద్ధి లో పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులను మంజూరు చేయడం జరిగింది.ఆదారాలతో అన్ని మీడియా ముందు ఉంచుతా.
గతంలో ఉన్న కాంగ్రెస్ కార్పొరేటర్లకు పార్టీని చూసి నిధులు కేటాయించలేదు.
మేము ప్రజల అభివృద్ధి ముఖ్యమని బీజేపీ,బి ఆర్ ఎస్ కార్పొరేటర్ల వార్డులలో సమాన నిధులు కేటాయించినం.
కార్పొరేషన్ సమావేశంలో ప్రజల సమస్యలపై పోరాడకుండా రాజకీయ ప్రయోజనాల కోసం కొద్దిమంది మాత్రమే బైకాట్ చేసి వెళ్లారు.
మాకు పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉంది.మీరు కావాలంటే సూత్రప్రాయమైన సూచనలు ,సలహాలు ఇవ్వండి కానీ ప్రతి అంశంపై రాజకీయ ప్రయోజనం చూడకండి.