వేద న్యూస్, వరంగల్:

వరంగల్ పోలీస్ టాస్క్ ఫోర్స్, నెక్కొండ పోలీసువారి ఆధ్వర్యంలో నెక్కొండ మండల పరిధిలోని చంద్రుగొండ సమీపంలో గల మల్లికార్జున రైస్ మిల్‌లో సంయుక్తంగా మంగళవారం దాడులు జరిపారు. సుమారు 62 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.

 సంఘని సూరయ్య, జటోత్ యాకూబ్‌ల నుంచి ఈ పీడీఎస్(ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యంతో పాటు ఒక ద్విచక్ర వాహనం, ఒక వేయింగ్ మిషన్‌ను సీజ్ చేశారు.  బియ్యాన్ని సివిల్ సప్లయ్ వారికి అప్పగించి తదుపరి విచారణకు కేసు నమోదు చేసినట్టు నెక్కొండ ఎస్ఐ తెలిపారు.