- సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొండు బానేష్
వేద న్యూస్, తాండూర్:
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొండు బానేష్ పేర్కొన్నారు. ఈ వారసంతకు మంచిర్యాల జిల్లా కాకుండా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి కూడా వేలాది మంది వచ్చి పోతుంటారనీ ఆయన చెప్పారు .
సంతలో షెడ్లు, గద్దెలు నిర్మించక పోవడంతో ప్రతి శనివారం నేలపైనే వ్యాపారం సాగిస్తున్నారని.., కురుస్తున్న వర్షాలకు అంతా బురద మాయంగా అలా మారి కొనుగోలుదారులు., వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉన్నదని, అలాగే మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించి వాడకం లో ఉంచాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సౌకర్యాలు కల్పించాలన్నారు.