వేద న్యూస్, ఇల్లంతకుంట:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామంలో ఎంగిలిపువ్వు బతుకమ్మ నిమజ్జనం వద్ద వీధి దీపాలు లేక మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. ఆదివారం మహిళలు బతుకమ్మ ఆడిన తర్వాత..
బతుకమ్మ వాగు వద్ద కు వెళ్లగా, అక్కడ ఎలాంటి వీధి దీపాలు లేకపోవడంతో వాపోయారు. చీకట్లో బతుకమ్మ ను వాగులో నిమర్జనం చేయాలా? అని ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు.గతంలో మిడ్ మానేరు వాగులో పలువురు గల్లంతయినట్టు పేర్కొన్నారు. బతుకమ్మ వేసే సమయంలో ఎలాంటి లైటింగ్ లేకుండా వాగు వద్దకు వెళ్లడం చాలా ఇబ్బందిగా మారినట్టు చెప్పారు.
గ్రామంలో ఒకరు మరణించడం ద్వారా వారు చితి మంట వెలుగులో బతుకమ్మ నీ వాగుకు తీసుకెళ్లడం చాలా బాధాకరం, ఇబ్బంది అని వెల్లడించారు. చితిమంట వెలుగులో బతుకమ్మ నిమర్జనం చేయాల్సి వచ్చింది అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పై అధికారులు బతుకమ్మకు సంబంధించిన ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.