వేద న్యూస్, చొప్పదండి:
చొప్పదండి 6వ వార్డ్ లో తాగు నీళ్లకు పోయే దారిలో ఎస్టి సామాజిక వర్గం కాలనీలో కనీస వసతులపై మున్సిపల్ అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఆ వార్డు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ నిర్లక్ష్యం వల్ల నిత్యం విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్నదని వెల్లడించారు. రాత్రి సమయంలో బయటకు వెళ్లాలి అంటే మహిళలు, పిల్లలు, వృద్ధులు భయపడుతున్నారు. 

ఇక్కడ చాలా విషపూరితకమైన కీటకాలు నిత్యం సంచరిస్తున్నాయని,  వీధి దీపాలు లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని  బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నట్టు కాలనీ వాసులు తెలిపారు. వెంటనే ఇక్కడి సమస్యలను గుర్తించి వీధి దీపాలు ఏర్పాటు చేయాలని అధికారులు కోరుతున్నారు.