వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/హన్మకొండ:
పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్) సంస్థ వరంగల్ బాధ్యులు శుక్రవారం హన్మకొండ జిల్లా డిప్యూటీ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి వై. వి. గణేష్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు గతంలో మధిర, చర్ల, ఖమ్మం మొదలగు ప్రదేశాల్లో గ్రీన్ భద్రాద్రి అనే హరిత స్వచ్ఛంద సంస్థను స్థాపించి తద్వారా ఎన్నో వేల మొక్కలు నాటించినట్లు వివరించారు. అవి పెద్ద వృక్షాలుగా ఎదిగి ఉన్నాయని తెలిపారు. కాగా, మొక్కలు నాటే విషయమై తన వంతు సహకారాన్ని యూఈఈపీకి అందిస్తానని, మొక్కలు నాటుటకు కాలంతో సంబంధం లేదని, నీరు ఇవ్వగలిగితే 2 మీపై బడిన ఎత్తైన మొక్కలు మాత్రమే నాటాలని డిప్యూటీ కలెక్టర్ చెప్పినట్లు యూఈఈపీ బాధ్యులు స్పష్టం చేశారు.

పట్టణం లో ఖాళీ స్థలాలు, కాలనీలు గుర్తించ వలసిందిగా యూఈఈపీ తరఫున కోరారు. ప్రతీ ఒక్కరు మొక్కలను నాటితే ఆరోగ్యవంతమైన వాతావరణంలో జీవిస్తామని చెప్పారు. ఇనుపరాతి గట్టు అటవీ ప్రాంతంను ‘రక్షిత అడవి’గా ప్రకటించి..కాపాడే ప్రయత్నం చేద్దాం అని డిప్యూటీ కలెక్టర్ చెప్పినట్లు యూఈఈపీ బాధ్యులు వెల్లడించారు.

పర్యావరణ పరిరక్షణ ఐక్య వేదిక బాధ్యులు ఈ సందర్భంగా డిప్యూటీ కలెక్టర్ కు వృక్ష ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో యూఈఈపీ బాధ్యులు, అధ్యక్షులు కాజీపేట పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి టీ.శ్రవణ్ కుమార్, న్యాయ సలహాదారు పొట్లపల్లి వీరభద్ర రావు, ఈసీ సభ్యుడు వకుళాభరణం శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ పిట్టల రవి బాబు తదితరులు పాల్గొన్నారు.