– 37 సర్పంచ్, 74 వార్డు స్థానాలకు దరఖాస్తులు
వేద న్యూస్,కాసిపేట:
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరం కాసిపేట మండలంలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. ఎన్నికల కేంద్రాల్లో అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యడంతో మండల పరిధి ఎన్నికల సందడితో మారుమోగుతోంది.
అధికారుల సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు మండలంలో 37 సర్పంచ్ స్థానాలకు 74 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని గ్రామాల్లో పోటీ హోరాహోరీగా మారుతుండగా, మరికొన్ని గ్రామాల్లో ఇంకా పరిస్థితి స్పష్టత చెందాల్సి ఉంది.మరోవైపు మండలంలోని పలు నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ముగింపు తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.ఎన్నికల వేడి ఊపందుకున్న కాసిపేట మండలంలో గ్రామాల వారీగా రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో, నామినేషన్ల ప్రక్రియ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.