– ఎస్పి. డి. వి. శ్రీనివాస రావు ఐపీఎస్

వేద న్యూస్, మెదక్ జిల్లా:

అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి
మూడో విడత చివరి రోజు స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ తెలిపారు. మూడో విడతలో భాగంగా నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న గ్రామ పంచాయతీలు, వార్డుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమల్లో ఉంటాయని, కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉందని ఆయన తెలిపారు.
ఎన్నికల సమయంలో అనవసర గొడవలు, అవాంఛనీయ చర్యలకు పాల్పడే వ్యక్తులపై ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అభ్యర్థులు మరియు వారి అనుయాయులు ఎన్నికల ప్రవర్తనా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఈ సందర్బంగా ఎస్పీ వెంట ఎస్బి ఇన్స్పెక్టర్ సందీప్ రెడ్డి, కూల్చారం ఎసై హమ్మద్ మోహినొద్దీన్, సిబ్బంది ఉన్నారు.