వేద న్యూస్, మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, తానంచర్ల, గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో తానంచర్ల గ్రామంలోని, మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల లో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని ,విద్యార్థులకు,
మరిపెడ ఎంఈఓ జి. అనితా దేవి, ముఖ్యఅతిథిగా విచ్చేసి నోట్ బుక్స్ పంపిణీ చేశారు

అనంతరం మరిపెడ ఎంఈఓ జి. అనితాదేవి మాట్లాడుతూ,నోట్ బుక్స్ పంపిణీ అనేది
విద్యను ప్రోత్సహించడం ఒక గొప్ప సేవా కార్యక్రమమని విద్యార్థిని,విద్యార్థులకు నోట్ బుక్స్ అందించడం ద్వారా వారి విద్యావసరాలను తీర్చడానికి సహాయపడుతుందని చెప్పారు. వారికి ఆర్థిక భారాన్ని తగ్గించడం, విద్యార్థిని విద్యార్థులకు చదువును ప్రోత్సహించడం తద్వారా విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడం జరుగుతుందని.. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థినీ విద్యార్థులకు చేయూతనివ్వడం అవుతుందని వెల్లడించారు. 

ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారు మరింత శ్రద్ధగా చదువుకోవడానికి, గొప్ప లక్ష్యాలను సాధించడానికి ప్రేరణనిస్తాయని అన్నారు. ఈ నోట్ బుక్స్ సద్వినియోగం చేసుకొని, విద్యార్థిని, విద్యార్థులందరూ బాగా చదువుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్, అంబేద్కర్ పూలే మహాజన సంఘం, కమిటీ సభ్యులు చింత దిలీప్, వెంకన్న, తానంచర్ల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం,బి, నిర్మల, ఉపాధ్యాయులు, వి, మాలు,ఎం, వెంకట కోటి,ఎం, అరుణమ్మ,పీ, శ్రీదేవి,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.