వేద న్యూస్, మరిపెడ:

జాతీయ నులి పురుగుల (పేగు పురుగు) నిర్మూలనా దినోత్సవాన్ని సోమవారం మరిపెడ ప్రభుత్వ పాఠశాల లోప్రధానోపాధ్యాయులు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది చే పిల్లలందరికి అల్బెండజోల్ మాత్రలను వేశారు. మాత్ర నేరుగా మింగరాదని, చప్పరించాలని లేదా బాగా నమిలి మింగాలి అని చెప్పారు.

11వ తేదీన అందుబాటులో లేని వారికి 18న కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. మేరకు పాఠశాలలో ఆల్బెండజోల్ ప్రాధాన్యాన్ని తెలిపే కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారని, వాటిని దూరం చేసి చిన్నారులు ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పాటిస్తున్నామని వివరించారు. 

అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువులు, నిలువ నీరు, జంతువుల మలం తదితర వాటి వల్ల నులిపురుగుల వ్యాప్తి జరుగుతుంది. నిల్వ ఉన్న, చెడిపోయిన ఆహారం, సరిగ్గా ఉడకని మాంసం వంటివి కూడా నులిపురుగుల వ్యాప్తికి కారణమవుతున్నాయని తెలిపారు. తీపి, పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, మలబద్దకం ఉన్నా నులి పురుగులు తయారవుతాయని చెప్పారు.

పిల్లలు మట్టిలో అడుకున్నప్పుడు గోళ్లలో మట్టి ఉండిపోతుందని, చేతులను నోట్లో పెట్టుకోవడం, కడగకుండా భోజనం చేయడం వంటి కారణాలతోనూ నులిపురుగులు సోకుతాయని వెల్లడించారు. కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడగాలని,. పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. 

చేతి గోళ్లు ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలని వివరించారు. గోళ్లలో మట్టి లేకుండా చూసుకోవాలని,. పాదరక్షలు ధరించాలని, అప్పుడే తయారు చేసిన వేడి ఆహారం తీసుకోవాలని వెల్లడించారు.  పిల్లలకు తీపి పదార్ధాలు, చాక్లెట్లు, మలబద్ధ కానికి కారణమయ్యే మైదా పిండి వంటలు బాగా తగ్గించాలని సూచించారు. 

 కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ, సీనియర్ ఉపాధ్యాయులు బయగాని రామ్మోహన్, ఉపాధ్యాయులు  జనార్ధన చారి, దేవుల, శ్రీశైలం, ప్రకాష్, ప్రసాదరావు, రమేష్ రెడ్డి, లెనిన్, బాబురావు, సారయ్య, జహీదా, సురేష్, రాజకుమారి, అనిత, సుధ, మంజుశ్రీ, పద్మ, శంకర్, వైద్య సిబ్బంది నర్సు బాయ్, శ్రీదేవి, శోభ, అనసూర్య మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.