వేద న్యూస్, వేములవాడ :

ఈ నెల 11న (ఆదివారం)వరంగల్‌ ఆర్ట్స్‌ కళాశాలలో లక్ష మందితో ఓసీ సింహగర్జన మహాసభను విజయవంతం చేయాలని తెలంగాణ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు కృషి రత్న బుస్స శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై కొందరు అసత్యప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఓసీలంతా ఐక్యమై హక్కుల కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లు జారీచేయాలని డిమాండ్‌ చేశారు. ఓసీల సింహగర్జన సమరభేరి సభను విజయవంతం చేసి ఆర్యవైశ్యుల ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆయన కోరారు.