• భారీ వర్షంతో పొంచిన వరద ముప్పు

వేద న్యూస్, ఇల్లంతకుంట:

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. పరిస్థితిని పరిశీలించిన తహసీల్దార్ ఏస్.ఏ. ఫారూఖ్,సీఐ మొగిలి. ఎంపిఓ శ్రీనివాస్, ఏఎస్సైతో పాటు పలు శాఖల సిబ్బంది బుధవారం తక్షణమే చర్యలు చేపట్టారు.

ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలను ప్రైమేరి స్కూల్ కు తరలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నీటిమీదుగా ప్రయాణించవద్దని సూచించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండడంతో రెవెన్యూ, పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు.