Screenshot

 

వేద న్యూస్, నల్లగొండ:

ముగ్గురు కొట్టుకుంటాంటో..నాలుగో వ్యక్తికి సందు అయినట్టుగా.. సదరు  వ్యక్తి దొరికిన కాడికి అక్కడి నుంచి దోసుకపోవడం అంటే ఇదేనేమో మరి!!..

 

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఉల్లి లారీ నల్లగొండ జిల్లా నార్కె ట్ పల్లి  వద్ద బోల్తా పడింది. దీంతో అటుగా వెళ్తున్న కొందరు ప్రయాణికులు డ్రైవర్, క్లీనర్లను పట్టించుకోకుండా ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్లారు.

దొరికింది దొరికినట్లుగా బైకులు, ఆటోల్లో సంచులు వేసుకుని వెళ్లిపోయారు. ఇక అక్కడ లారీ బోల్తా  పడి జరిగిన  ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు స్వల్ప గాయాలయ్యాయి.  అయితే, ఇదేదీ తమకు పట్టదన్నట్టుగా కొందరు అందిన కాడికి తీసుకెళ్లాలన్నట్టుగా ఉల్లి బస్తాలను సదరు బోల్తా పడిన లారీ నుంచి భుజాల మీదుగా మోసుకెళ్తున్నారు. ఇది చూసిన ప్రయాణికులు.. ఓలమ్మో..ఇది నేను ఏడ సూడలే.. ఉల్లి బస్తాలు ఎత్తుకెళ్తుతాం డ్రు!.. ఇదేం కాలం .. అని అనుకుంటున్నారు.