•  ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు
  •  సర్కార్ జర్నలిస్టులకు అన్ని విధాలుగా ఆదుకోవాలి
  •  మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటీ

వేద న్యూస్, జమ్మికుంట:

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జమ్మికుంట కార్యాలయాన్ని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో నిస్వార్థంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ..నిత్యం ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టి చేరవేసే క్రమంలో జర్నలిస్టుల సేవలు అభినందనీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక జర్నలిస్టుల కథనాల వల్ల ఉద్యమానికి ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. జమ్మికుంట పట్టణంలో టీడబ్ల్యూజేఎఫ్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు.


అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిస్వార్థంగా సేవలందిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి..నివేశనా స్థలాలు అందించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్టులందరికీ తక్షణమే హెల్త్ కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షులు యోహన్ మాట్లాడుతూ టీడబ్ల్యూజేఎఫ్ జమ్మికుంట ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి వచ్చిన టీడబ్ల్యూజేఎఫ్ నాయకులు, ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు మేలు చేయడం కోసం కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అరికెళ్ల భానుచందర్, హుజురాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు సౌడమల్ల యోహన్, కార్యదర్శి అయిత రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు ఏబూషి సంపత్, కోశాధికారి దయ్యాల సుధాకర్, సహాయ కార్యదర్శి ఖాజా ఖాన్‌తో పాటు ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పొన్నగంటి సంపత్, వీణవంక జడ్పీటీసీ ముసపట్ల రేణుక తిరుపతిరెడ్డి, బీజేపీ నాయకులు ఆకుల రాజేందర్, స్థానిక కౌన్సిలర్ రామ సాయిని రవి, దయ్యాల శ్రీనివాస్, భోగం సుగుణ, అఖిలపక్షం నాయకులు, జర్నలిస్టులు రంజిత్, రాజు, ఏ.శ్రీకాంత్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.