• జిల్లా ఓడిసిఎంఎస్ మాజీ చైర్మెన్ కుడితి మహెందర్ రెడ్డి విమర్శ
  • మరిపెడ మున్సిపల్ కేంద్రంలో ఇంటింటా బీఆర్ఎస్ తరఫున ప్రచారం

వేద న్యూస్, మరిపెడ:
డోర్నకల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీ ఎస్ రెడ్యానాయక్ గెలుపు కోసం శనివారం కుడితి మహెందర్ రెడ్డి నేతృత్వంలో గులాబీ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం మొదలు పెట్టాయి. తొలుత బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను శ్రీ సీతా రాముల వారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నే నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధిగా రెడ్యా నాయక్ నిలిచి పార్టీలకు అతీతంగా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు మనసులో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో రెడ్యానాయక్ ఉండగా..ఢిల్లీ గులాంల వద్ద విపక్ష పార్టీల నేతలు ఉన్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వము హ్యాట్రిక్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ లు మాచర్ల స్రవంతి భద్రయ్య, రేఖ లలిత వెంకటేశ్వర్లు పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు.