వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి :

కురుపాం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్, డైరెక్టర్ ల ప్రమాణ స్వీకార మహోత్సవములో ముఖ్య అతిధులుగా ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఎమ్మెల్యే సమక్షంలో పిఎసిఎస్ అధికారులు చైర్మన్, డైరెక్టర్ లతో ప్రమాణం చేయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు అందుబాటులో ఉండి వారికి కావలసిన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందేటట్లు చెయ్యాలని సూచించారు.

కురుపాం పిఎసిఎస్ చైర్మన్ గా డొల్లు కిషోర్ కుమార్, డైరెక్టర్లుగా తంగుడు సత్యనారాయణ, కర్రి సత్యంనాయుడు ప్రమాణం చేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గంలోని కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద కొమరాడ టిడిపి నాయకులు బత్తిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.