వేద న్యూస్, వరంగల్:
నెక్కొండ మండలం రేడ్లవాడ గ్రామంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, నెక్కొండ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్లవాడ పిఎసిఎస్ చైర్మన్ జలగం సంపత్ రావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకొచ్చే ధాన్యం నాణ్యత ప్రమాణాలను పాటించి రైతులు మంచి ధరను పొందాలని సూచించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బక్కి అశోక్ పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్, నర్సంపేట కోర్టు ఏజీపీ అడ్వకేట్ బండి శివకుమార్, రెడ్లవాడ సొసైటీ వైస్ చైర్మన్ రోజనాల సంపత్ మండల పార్టీ నాయకులు ఈదునూరి సాయికృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సింగం ప్రశాంత్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు