• ఎస్సై సిరిసిల్ల అశోక్

 

వేద న్యూస్ , ఇల్లంతకుంట:

 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఓగులాపూర్ గ్రామపంచాయతీ చెందిన మాజీ పంచాయతీ కార్యదర్శి సయ్యద్ ముక్తార్ అహ్మద్ ప్రస్తుతం వీర్నపల్లి మండలం నకు బదిలీ అయినాడు. గతంలో ఓబులాపూర్ గ్రామ పంచాయతీ సెక్రెటరీగా విధులు నిర్వహించిన సమయంలో.. 2025 సంవత్సరంలో జనవరి నుండి మే నెల వరకు వరకు ఓగులాపూర్ గ్రామపంచాయతీ నందు విధులు నిర్వహిస్తున్న.. ఐదుగురు మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇవ్వలేదని గతంలో కలెక్టర్ కి మల్టీపర్పస్ వర్కర్లు విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. 

ఆ విషయంపై పంచాయతీరాజ్ అధికారులు చేసిన విచారణలో సదరు పంచాయతీ సెక్రెటరీ మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు ఇవ్వకుండా ఆ డబ్బులు మొత్తం రూ. 1,42,000 లను తానే ఐదు చెక్కుల ద్వారా డ్రా చేసుకొని ..తన వ్యక్తిగత అవసరాల కోసం వాడుకోవడం జరిగింది అని విచారణలో తెలిసింది.

ఈ విషయం గురించి మండల పంచాయతీ అధికారి అయినా మాణిక్యరావు శ్రీనివాస్. ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేయడం జరిగింది.

తగిన సాక్షాధారాలు సేకరించిన తర్వాత గురువారం పంచాయతీ సెక్రటరీ  ముక్తార్ అహమ్మద్ ను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ తరలించారు.