వేద న్యూస్, వరంగల్:
ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా,ఉద్యోగుల సమస్యలు తన స్వంత సమస్యలుగా భావించి వాటిని పరిష్కరించుటకు కృషి చేసే హనుమకొండ జిల్లా TNGO’S యూనియన్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కు హనుమకొండ పంచాయతీ కార్యదర్శుల తరుపున పంచాయతీ కార్యదర్శులఫోరం జిల్లా కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సోమవారం రాజేందర్.. పంచాయతీ కార్యదర్శుల బదిలీల గురించి కలెక్టర్ తో మాట్లాడి బదిలీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని తెలియజేసినందున ఆకుల రాజేందర్ అన్న కు థాంక్స్ చెబుతున్నట్టు నరేష్ పేర్కొన్నారు.