- జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి
వేద న్యూస్, మరిపెడ:
సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ మహబూబాబాద్ జిల్లా పరిధిలో గల మొత్తం (24) వసతి గృహాలలో పేరెంట్స్ కమిటీ (తల్లిదండ్రుల సమావేశము) ఏర్పాటు చేశారు. అన్ని వసతి గృహాలలో తల్లిదండ్రులు పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొని వారి విలువైన సలహాలు సూచనలు ఇచ్చారు.
ఈ సూచనలు సలహాలు తూచా తప్పకుండా పాటించి భవిష్యత్తులో అన్ని వసతి గృహాలు సజావుగా నడపడానికి ఎంతో తోడ్పడు తాయని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మాడిశెట్టి నరసింహస్వామి పేర్కొన్నారు.
ఇట్టి వసతి గృహాలలో వసతి గృహ అధికారులు సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, హాస్టల్ సిబ్బంది పాల్గొని విజయవంతము చేశారు. ఈ పేరెంట్స్ కమిటీ సమావేశాలు జిల్లా సాంఘిక సంక్షేమ అభివృద్ధి అధికారి ఎం.నరసింహస్వామి, ఎస్సీ బాయ్స్ హాస్టల్ బలపాల, బాలికల హాస్టల్ కురవి , మరిపెడ , లలో స్వయంగా పాల్గొని విజయవంతముగా చేశారు.