• శుక్రవారం రిలీజైన ఈ ఫిల్మ్‌ను ఆదరించాలని కోరిన అసోసియేట్ డైరెక్టర్ కుమార్ కోరే
  • ‘హరిహర’ థియేటర్ లో సినిమ చూసి హర్షం వ్యక్తం చేసిన కుమార్ ఫ్రెండ్స్ 
  • కుటుంబ సమేతంగా ఈ హస్యభరిత చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని రిక్వెస్టు

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట మండల పరిధిలోని రంగమ్మపల్లె గ్రామానికి చెందిన కుమార్ కోరే సహాయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పారిజాత పర్వం’ మూవీ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రాన్ని అందరూ వీక్షించి..ఆదరించాలని కోరే కుమార్ కోరారు. కమెడియన్ సునీల్, చైతన్య రావు, వైవ హర్ష, శ్రద్దా దాస్, మాళవిక, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి నటించిన ఈ సినిమాను వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై  మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు.

కాగా జమ్మికుంటవాసి సహాయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడంతో జమ్మికుంట పట్టణవాసులు, రంగమ్మపల్లె గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. చిత్రానికి ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన వస్తోందని మూవీ మేకర్స్ పేర్కొన్నారు. చిత్రానికి సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించగా, సంగీతం రి అందించారు. బాల సరస్వతి డీఓపీ కాగా, మహిధర్ రెడ్డి, దేవేష్ సినిమాను ప్రొడ్యూస్ చేశారు.

జమ్మికుంట పట్టణంలోని హరిహర థియేటర్ లో ప్రదర్శితమవుతున్న చిత్రాన్ని కోరే కుమార్ స్నేహితులు శుక్రవారం వీక్షించి హర్షం వ్యక్తం చేశారు. తమ స్నేహితుడు చిత్రసీమలో మరింత ఉన్నతస్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. అందరూ కుటుంబసమేతంగా వీక్షించే సినిమా ‘పారిజాత పర్వం’ అని ఈ సందర్భంగా కుమార్ కోరే, ఆయన స్నేహితులు వెల్లడించారు.పూర్తిగా ఈ చిత్రం హాస్యంతో కూడుకున్నదని, సినిమా చూసి ప్రేక్షకులు హాయిగా నవ్వుకోవచ్చని స్పష్టం చేశారు.