వేద న్యూస్, పార్వతిపురం:
మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం ఆయన స్వగ్రామం చినమేరంగిలోని నివాసంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొని విజయరామరాజుకు బర్త్ డే విషెస్ చెప్పారు. నియోజకవర్గ పరిధిలో గల జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని శత్రుచర్ల విజయరామరాజుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పాతపట్నం, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా తెలుగుదేశం నాయకులు విచ్చేసి మాజీ మంత్రికి విషెస్ చెప్పారు. బొబ్బిలి, కురుపాం ఎమ్మెల్యేలు ఇరువురు కలిసి స్థానిక హాస్పటల్‌లో రోగులకు రొట్టెలు, ఫ్రూట్స్ అందజేశారు. ఆరుసార్లు శాసనసభ్యునిగా, మూడుసార్లు పార్లమెంట్ సభ్యునిగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా, రెండుసార్లు క్యాబినెట్ మంత్రిగా శత్రుచర్ల విజయరామరాజు పని చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన శత్రుచర్ల 45 సంవత్సరాలకు పైగా కురుపాం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ.. వారి సమస్యల ఇప్పటికీ పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నారు. నాగూరు, పాతపట్నం, పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్వతీపురం పార్లమెంట్ స్థానానికి మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. రాష్ట్ర అటవీ శాఖ, రవాణా శాఖ, మైనర్ ఇరిగేషన్ శాఖలకు మంత్రిగా శత్రుచర్ల విజయరామరాజు పనిచేశారు. వేడుకల్లో అధిక సంఖ్యలో శత్రుచర్ల అభిమానులు, కొమరాడ మండలం తెలుగు రైతు అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.