వేదన్యూస్ – రాజమహేంద్రవరం
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల మీడియా సమావేశంలో మాజీ ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ ది ముమ్మాటికి హత్యనే..
ప్రమాదం కాదు. ఈ సంగతి పోలీసులకు .. వైద్యులకు తెల్సు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేసు దర్యాప్తులో ఉండగా ప్రవీణ్ ది ప్రమాదం కాదు.
హత్య అంటూ వ్యాఖ్యానించిన హర్షకుమార్ దీనికి సంబంధించిన ఆధారాలు ఏమైన ఉంటే ఒకటి రెండు రోజుల్లో తమకు అందజేయాలని దర్యాప్తు అధికారి రాజమహేంద్రవరంలోని హర్షకుమార్ నివాసంలో అతనికి బీఎన్ఎస్ సెక్షన్ 179 కింద నోటీసులు అందజేశారు.