వేద న్యూస్, డెస్క్ :
టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే.కాగా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని, ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.