వేదన్యూస్ -అరకు
సింగపూర్ లో అగ్ని ప్రమాదానికి గురైన తన తనయుడు మార్క్ శంకర్ దగ్గరకు ఈరోజు రాత్రి తొమ్మిదిన్నరకు ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడకి వెళ్లనున్నారు.
తనయుడి ప్రమాదం గురించి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నేను అరకులో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఈ ప్రమాదంలో కుమారుడు శంకర్ కాళ్ళు చేతులకు గాయాలు అయ్యాయని తెలిసింది. పొగ ఊపిరితిత్తులోకి వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ధీర్ఘకాలంలో పిల్లాడిపై ఈ ప్రభావం ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని అసలు ఊహించలేదు. ఆ గదిలో ముప్పై మంది చిన్నారులున్నారని తెల్సింది. స్పందించి అండగా ఉన్న అందరికి కృతజ్ఞతలు అని అన్నారు.