వేదన్యూస్ – పశ్చిమ గోదావరి
ఒక్కొక్కసారి ఓ వ్యక్తిపై ఉన్న అభిమానంతో ఏమి చేస్తారో .. ఎంతదాక తెగిస్తారో కూడా ఆర్ధం కానీ రోజులివి. కొంతమంది అభిమానంతో అభిమాన వ్యక్తి కోసం రక్తాలు చిందిస్తారు. అదే రక్తంతో ఆయన చిత్రాన్ని సైతం గీస్తారు. ఈరోజుల్లో ఇలాంటివి చాలా మాములు అయిపోయింది.
అలాంటి వార్తనే ఇది. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా.. దువ్వకు చెందిన ఇంటర్మీడియట్ చదివే ఓ విద్యార్థి తన రక్తంతో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. ఇటీవల తాను రక్త దానం చేసిన రక్తంతో గీసిన ఈ చిత్రాన్ని రాజమండ్రిలో జరిగిన అమరావతి చిత్రకళా వీధి కార్యక్రమంలో అతడు ప్రదర్శించారు.
కొంతమంది ఆ విద్యార్థి చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. మరి కొంత మంది అభిమానం ఉండోచ్చు కానీ ఇలా రక్తంతో ఆటలెందుకు. అదే రక్తం వేరేవాళ్లకిస్తే ప్రాణాలతో బతుకుతారు కదా అని విమర్శిస్తున్నారు.