HCU land dispute - 10 lakhs if you catch that photographer..!

వేదన్యూస్ – ఖైరతాబాద్

వినడానికి ఇది వింతగా ఉన్నా ఇదే నిజం అంటున్నారు విద్యుత్ విభాగంలో పని చేసే ఉద్యోగులు.. ఈ సంస్థలో ఉన్నత స్థాయి పదవులు.. పోస్టులకు ఓ రేటు ఫిక్స్ చేస్తున్నారని విమర్శలు విన్పిస్తున్నాయి. చేతికి డబ్బులిచ్చుకో .. నీకు నచ్చిన పోస్టు తెచ్చుకో అన్నట్లు పరిస్థితి తయారైందని గుసగుసలు విన్పిస్తున్నాయి. అయితే ఈ తంతూ అంతా ప్రభుత్వ పెద్దల కన్నుసైగల్లో నడుస్తుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సంస్థకు చెందిన డిస్కం సీఎండీ పోస్టు నుండి ఏఈ వరకూ పోస్టింగ్ ను బట్టి రేటును మాట్లాడుకుంటున్నారని అందరూ చెప్పుకుంటున్నారు.

గత ఏడాది జనవరి నెలలో డిస్కం ఐదు డైరెక్టర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెల్సిందే.. వీరికి ఈనెలలోనే ఇంటర్వూలు జరగనున్నాయి. దీనిపై ఇద్దరూ సీజీఎం స్థాయి అధికారుల్లో ఒకరూ ఇంకొతన్ని మీకు డైరెక్టర్ పోస్టు ఖరారైందంటగా..కంగ్రాట్స్ అని అనగానే వామ్మో నాకోద్దు ఆపోస్టు.. ఆ పోస్టుకు రెండు కోట్లు అడిగారు . నా దగ్గర రెండు కోట్లు ఎక్కడవి. నాకు వద్దే వద్దూ ఆ పోస్టు అని సదరు వ్యక్తితో అన్నట్లు టాక్.

డిస్కం సీఎండీ పోస్టుకు అయితే ఇరవై కోట్లు.. యాబై కోట్లు అని విద్యుత్ సంస్థల ఇంజనీర్లే చర్చించుకోవడం ఇక్కడ గమనార్హం. డిస్కం సీఎండీ నుంచి అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) వరకు పోస్టింగ్‌ను బట్టి రేటు నడుస్తున్నదని చెప్పుకుంటున్నారు. అయితే డిస్కం డైరెక్టర్ల పోస్టుల కోసం ప్రధానంగా రిటైరైన సీఈలు.. సీజీఎంలు  లేదా ప్రస్తుతం పనిచేస్తున్నవాళ్లు పోటీ పడుతుంటరు.ఇంకోవైపు ఈ పోస్టుకోసం ఓ మహిళా అధికారి ఏకంగా ఏఐసీసీ అగ్రనేతనే ఆశ్రయించినట్లు విద్యుత్ భవన్ లో టాక్ విన్పిస్తుంది. చూడాలి మరి ఈ వారల్లో ఎంత నిజం ఉందో మున్ముందు తెలుస్తుంది.