- పీ డీ ఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్
వేద న్యూస్, కరీంనగర్:
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని పిడిఎస్ యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన కరీంనగర్ జిల్లాకేంద్రంలోని తెలంగాణ చౌక్ లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నూతన జాతీయ విద్యా విధానం 2020 రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని కాపాడాలనీ కోరారు. చరిత్రను వక్రీకరిస్తూ చేస్తున్న ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులను ఆపాలనీ తెలిపారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు నిధులు తగ్గించి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలనీ సూచించారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ పరిశోధక విద్యార్థుల ఫెలోషిప్ లలో కోతను విరమించుకోవాలనీ అన్నారు.