• ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు

వేద న్యూస్, పెద్దపల్లి:

భార్యాభర్తల పంచాయతీ కోసం ఇరువర్గాలు సమావేశం అయ్యారు.. అబ్బాయి తరపు వారిపై అమ్మాయి తరపు బంధువులు ఒక్కసారిగా విరుచుకుపడి విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయి తరఫు వారు, ఓదెల మండలానికి చెందిన అబ్బాయి తరుపు వారు పంచాయతీ విషయంలో సుగ్లాంపల్లి గ్రామంలో సమావేశమయ్యారు.

భార్యాభర్తల పంచాయతీ విషయంలో చర్చిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా అమ్మాయి తరపు వారు కత్తులతో అబ్బాయి తరపు వారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పెద్దపల్లి మండలం రాగాపూర్ కు చెందిన గాండ్ల గణేష్, మోటం మల్లేష్ మృతిచెందగా, మోటం మధునయ్య పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మోటం సారయ్య తలకు గాయం కావడంతో పాటు మరికొందరు గాయపడ్డారు. గాయపడ్డ వారిని సుల్తానాబాద్ కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.