వేద న్యూస్,శాయంపేట:
తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల కమిటీ శాయంపేట మండల అభివృద్ధి అధికారికి వినతి పత్రం అందచేశారు. అనంతరం మండల అధ్యక్షుడు వంగర సాంబయ్య మాట్లాడుతూ తెలంగాణలో 50 సంవత్సరాలు నిండిన పద్మశాలి అర్హులైన వారందరికీ జియో ట్యాగ్ తో సంబంధం లేకుండా ఆసరా పింఛన్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఉమ్మడి రాష్ట్రంలో 1500 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆ పరంపర నేటికీ కొనసాగుతున్నదని ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని అన్నారు.చేనేత ,పవర్ లూమ్స్ కార్మికులకు సరిపడా పని లేక పని భద్రత లేని కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే ఆత్మహత్యల నివారణకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి అర్హులైన వారందరికీ ఐదు వేల రూపాయల ఆసరా ఇవ్వాలని అన్నారు.
చేనేత కార్మికులు చనిపోతే వారి స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛన్ ఇవ్వవలసి ఉండగా గత ప్రభుత్వము ఇవ్వలేదు. నేటి ప్రభుత్వం కూడా అదే బాటలో కొనసాగుతున్నారనీ మరణించి పెండింగ్ లో ఉన్న చేనేత కార్మికుల స్థానంలో వారి భార్యలకు ఆసరా పింఛను వెంటనే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం శాయంపేట మండల ప్రధాన కార్యదర్శి సామల ధనుంజయ్,
జిల్లా ప్రధాన కార్యదర్శి దిడ్డి రమేష్ ,జిల్లా నాయకుడు బాసని బాలకృష్ణ,పద్మశాలి మండల మహిళా అధ్యక్షురాలు బాసని శాంత,మండల నాయకులుచిందం రవి, బాసాని మల్లికార్జున్ , దిడ్డి ప్రభాకర్,ముదిగొండ సంతోష్, మోత్కూరి సత్యనారాయణ,కొండ ముకుందం , వనం దేవరాజు, కోమటి శేఖర్, దాసరి రవి, రంగు మహేందర్, గొట్టిముక్కుల రాజు , బంక రమేష్ తదితరులు పాల్గొన్నారు.