వేద న్యూస్,మిర్యాలగూడ ప్రతినిధి :

సమాజంలో ఉన్న అనేక పీడనలు తొలగిపోవాలి అంటే శాస్త్రీయ సమాజాన్ని రూపొందించడం ఒకటే మార్గమని జెవివి రాష్ట్ర కార్యదర్శి వెంకట రమణా రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయులు, అధ్యాపకులు,వైద్యులు, మేధావులు,న్యాయవాదులు, పాత్రికేయులు,యువజనులు, విద్యార్థులు, శాస్త్ర- సాంకేతిక రంగాల్లో పనిచేసే వారందరూ కూడా పాల్గొని తమ వంతుగా ప్రజలలో శాస్త్రీయ దృక్పథం పెంపొందేటట్లు కృషి చేయాలని జెవివి రాష్ట్ర కార్యదర్శి తెలియజేశారు. 2025- 26 సంవత్సరానికి గాను జన విజ్ఞాన వేదిక సభ్యత్వ నమోదు,అదేవిధంగా జనవిజ్ఞాన వేదిక రూపొందించే మాసపత్రిక చెకుముకి చందాదారులను చేయించడం వంటి కార్యక్రమాలకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం నల్లగొండ జిల్లా కమిటీ అధ్యక్షుడు గుత్తికొండ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాఫెల్,రాష్ట్ర కమిటీ బాధ్యులు వద్దిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,కనుకుంట్ల విద్యాసాగర్,దగ్గుపాటి విమల, జిల్లా కమిటీ బాధ్యులు మధుసూదన్,గౌతమి,శంకర్ తదితరులు పాల్గొన్నారు.