- సమస్యలు పరిష్కరించాలని వెంకట్‌కు దరఖాస్తులు
- ‘నేనున్నాను’ అని భరోసా కల్పించిన సామాజికవేత్త
- ఉద్యోగ కల్పనతో పాటు ఆరోగ్యం విషయమై సాయం
వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి:
ఆయన ప్రజాప్రతినిధి కాదు. కానీ, ఆయన వచ్చారని తెలుసుకుని జనం తండోపతండాలుగా తరలివచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని సిర్సపల్లి గ్రామంలోని ఇంటిని వెతుక్కుంటూ మరీ వచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రజలు వేడుకున్నారు. ఇంతకీ ఆయనెవరంటే..ప్రముఖ సామాజికవేత్త, మల్టీ నేషనల్ కంపెనీ ‘జెన్ ప్యాక్ట్’ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్.
సోమవారం ఆయన తన సొంతూరు సిర్సపల్లికి వచ్చారనే సంగతి తెలుసుకుని జనం ప్రవాహంలా ఆయన ఇంటిబాట పట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలతో పాటు గోదావరిఖని, మంచిర్యాల్, కరీంనగర్ నుంచి కూడా ప్రజలు వచ్చారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వారంతా ఇంటిలో బారులు తీరారు.
ప్రజల సమస్యలను తెలుసుకున్న వెంకట్ ‘నేనున్నానని వారికి భరోసా’ కల్పించి, తన వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. తక్షణమే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తన టీమ్ కు సబ్బని వెంకట్ సూచనలు చేశారు. పిల్లల చదువులకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలను విద్యా సంస్థల యజమానులతో మాట్లాడి పరిష్కారం చేశారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు చదివి ఉపాధి లేక ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని తెలుపగా..తక్షణమే ఉపాధి కల్పనకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు మాట్లాడుతూ వెంకట్ అనేకమంది చదువుకున్న పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని చెప్పారు.
ఆస్పత్రుల్లో చేరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అనేకమంది తమ లాంటి పేద ప్రజలకు వెంకట్ ఆస్పత్రుల్లో తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని వెల్లడించారు. ఎలాంటి వ్యక్తిగత స్వార్థం లేకుండా నిస్వార్థంగా తమకు సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తమ కుటుంబాలు సబ్బని వెంకట్ కు రుణపడి ఉంటాయని పేర్కొన్నారు.
సబ్బని వెంకట్ నివాసం ప్రజాపాలన భవనం మాదిరిగా అనిపించిందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడ్డారు. యువతకు ఉద్యోగాలతో పాటు మౌలిక వసతుల కల్పన, అనారోగ్యం విషయమై ట్రీట్ మెంట్ తో పాటు పలు విషయాలపై పలువురు సబ్బని వెంకట్ కు దరఖాస్తులు సమర్పించారు. సమస్యల పరిష్కారానికి సబ్బని వెంకట్ తన టీంకు సూచనలు ఇచ్చారు. పదవి లేకపోయినా ప్రజల కోసం సబ్బని వెంకట్ తన శక్తి మేరకు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారని పలువురు పేర్కొన్నారు.