• అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించినందుకు రాస్తారోకో

వేద న్యూస్, కరీంనగర్:

కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో తొలగించడాన్ని నిరసిస్తూ కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు, దళిత సంఘాలతో కలిసి విగ్రహం తొలగించిన చోట నుండి నిరసన ర్యాలీ గాంధీ చౌక్ వద్దకు చేరుకొని రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు.

వి వాంట్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసన కారులనులో అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు.. కంసాల శ్రీనివాస్ నక్క ప్రమోద్ గోస్కి శంకర్ లు మీడియాతో మాట్లాడారు. నగరపాలక సంస్థ ఫుట్ బోర్డు పైన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని వారి జయంతి వర్ధంతి లకు వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నామని అన్నారు.

అయితే అంబేద్కర్ అంటే పడని కొంతమంది దుర్మార్గులు హైకోర్టులో కేసు వేసి తొలగించుటకు ఆర్డర్ తీసుకొని రావడం… దానికి అధికారులు పోలీసులు ఒక కుట్రపూరితంగా అర్ధరాత్రి పూట ఎవరికి ముందు సమాచారం ఇవ్వకుండా దొంగతనంగా అవమానకరమైన పద్ధతిలో విగ్రహాన్ని జెసిబి తో తొలగించడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఎవరో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వ అధికారులు విగ్రహాన్ని తొలగించడం చాలా బాధాకరమన్నారు.