వేద న్యూస్, వరంగల్:

వనాలు, వన్యప్రాణుల రక్షణ, సహజవనరుల సంరక్షణ, పర్యావరణ విద్య, ప్రకృతి పరిరక్షణకు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ స్వచ్చంద సంస్థ చేసిన, చేస్తున్న సేవలను గుర్తిస్తూ .. 2025 సంవత్సరానికి గాను ఉగాది పురస్కారాన్ని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ బృందం అందజేసింది. ఈ సంస్థ(OWLS NGO)కు అవార్డు వరించడం పట్ల ఆ ఎన్జీవో  జాయింట్ సెక్రెటరీ రవిబాబు పిట్టల స్పందించారు. 

ఓల్స్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు ఇందారం నాగేశ్వరరావుకు పిట్టల రవిబాబు ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. ఇందారం ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని అనుభవిస్తూ, నిస్వార్థంగా, సమయస్ఫూర్తితో లైక్ మైండెడ్  నిపుణులను కలుపుకొని సంస్థను భుజస్కందాలపైన వేసుకొని, ఎలాంటి లాభాపేక్ష  లేకుండా  ముందుకెళ్లడం గొప్ప విషయమని వెల్లడించారు.  

అన్ని కాలాలలో,  దేశంలో కాలానుగుణంగా 100 కు పైగా జలపాతాళాను తిరిగి చూసి వాటిని ప్రపంచానికి ఇందారం పరిచయం చేస్తున్నారని వివరించారు. జలపాతాళతోపాటు, పచ్చని ప్రకృతి అందాలను (Land Scapes), అటవీ చిత్రాలను, ముఖ్యంగా అటవీ జంతువుల చిత్రాలను కెమెరాలో బందిస్తూ, ప్రత్యేకంగా బెంగాల్ టైగెర్స్ ను స్పెషల్ గా రెప్రజెంటేషన్ చేస్తూ, ఫ్లోరా, fauna ను, biodiversity కాపాడుటలో నాగేశ్వరరావు కృషి చేస్తున్నారని తెలిపారు.  

ఒక నిర్ధిష్టమైన కమిట్‌మెంట్‌తో  ప్రజలతో.. ముఖ్యంగా యువతతో, సంబంధిత శాఖ అధికారులతో అటవీ సంపదను కాపాడుటలో ముఖ్యపాత్రవహిస్తూ, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తో కలిసి వనదర్శిని, అటవీ, జంతు విజ్ఞాన ఫొటో ప్రదర్శన విద్యా కార్యక్రమాలు స్కూళ్ల లో పర్యావరణ, అటవీ దినోత్సవాల సందర్భంగా OWLS సంస్థ ద్వారా బాధ్యత తో నాగేశ్వరరావు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. 

ఔత్సాహికులకు అడవుల పట్ల అవగాహన కోసం.. అటవీ సందర్శనలాంటి ఎన్నో స్వచ్చంద కార్యక్రమాలను, కష్టానష్టాలను ఓర్చుకొని చేస్తున్నారని  చెప్పారు. ఇలాంటి ఎన్నో అవార్డులు, రివార్డులు ఓల్స్ సంస్థ  పొందాలని ఆకాంక్షించారు. ఓల్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగేశ్వరరావుతో కలిసి పనిచేస్తున్నందుకు తాను గర్విస్తున్నానని  పర్యావరణ వేత్త, ఓల్స్ ఎన్జీవో జాయింట్ సెక్రెటరీ రవిబాబు పిట్టల పేర్కొన్నారు.