వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా:
కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ టి. జగదీశ్వరి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నదాత సుఖీభవ పియం కిసాన్ పథకం ద్వారా రైతులకు 2025-26 సంవత్సరానికి మొదట విడతగా రైతులకు వారి ఖాతాలో 7000 జమ చేస్తామని తెలిపారు. సెంట్రల్ గవర్నమెంట్ 6 వేలు, స్టేట్ గవర్నమెంట్ 14 వేలు కలిపి 3 విడతల కింద సంవత్సరానికి 20,000 రైతులకు అందిస్తామని తెలిపారు. వ్యవసాయ శాఖ ద్వారా అందించే పలు పథకాలకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ కడ్రక కళావతి, వైస్ చైర్మన్ గౌరీ శంకర్, ప్రత్యేక అధికారి ధర్మచంద్రారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.