వేద న్యూస్, వరంగల్ టౌన్:
గ్రేటర్ వరంగల్ నగరంలోని కీర్తి నగర్ గొర్రెకుంట ప్రాంతంలోని పోచమ్మ తల్లికి భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. బుధవారం ఉదయం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆయా ప్రాంతాల ప్రజలు భక్తిశ్రద్ధలతో పోచమ్మకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులు మముల్ని చల్లగా చూడు పోచమ్మ తల్లి అంటూ వేడుకున్నారు.
