- వరద నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటికి చేర్చిన పోలీసులు
- తాడు సాయంతో స్వయంగా ఇన్ స్పెక్టర్, సిబ్బంది రక్షణ చర్యలు
వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
వరంగల్ నగరంలో కొద్దిసేపటి క్రితం కురిసిన భారీ వర్షం కారణంగా వరంగల్ ప్రాంతాల్లోని అండర్ బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరింది. దీంతో బస్సు ఒక్కసారిగా వరద నీటిలో చిక్కి నిలిచిపోవడంతో సమాచారం అందుకున్న ఇంతేజార్ గంజ్ ఇన్ స్పెక్టర్ షుకూర్ తన సిబ్బందితో కలిసి తాళ్ల సహాయంతో ప్రయాణికులకు సురక్షితంగా బయటకు రప్పించారు.
విధి నిర్వహణలో వెంటనే స్పందించి అప్రమత్తతతో.. వరద నీటిలో చిక్కుకున్న బస్సులోనీ ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు పోలీస్ అధికారి, సిబ్బంది తీసుకున్న చర్యల పట్ల నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
