వేద న్యూస్, హన్మకొండ:
హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు చేయడమే కాకుండా వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయగా, హనుమకొండ పోలీస్ వెంటనే స్పందించి అట్టి ఫోన్ ని గుర్తించి ఆమెకు అప్పగించడం జరిగింది. ఫోన్ ని గుర్తించి అప్పగించడంలో ప్రతిభ కనబరిచిన క్రైమ్ పార్టీ సిబ్బంది అశోక్ మరియు రావుఫ్ లను సిఐ అభినందించారు.