వేద న్యూస్, కమలాపూర్ :
కమలాపూర్ పోలీసులు, ఉప్పల్ యువత దాతృత్వాన్ని చాటుకున్నారు. దేశరాజుపల్లి గ్రామంలోని పిట్టలపల్లికి చెందిన లావుడ్య కమలమ్మ ఇటీవల పాము కాటుతో మరణించింది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉప్పల్ యువత బాధితులకు సహాయం అందించాలనుకున్నారు. ఆ గ్రామానికి చేరుకోడానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో పోలీసులు యువత కలిసి ట్రాక్టర్ లో అక్కడికి చేరుకున్నారు.
సీఐ హరికృష్ణ, ఉప్పల్ యూత్ సభ్యులు మొండెద్దుల నాగరాజు, పసునూటి రాణప్రతాప్ బాధితులకు 75 కిలోల బియ్యం అందజేశారు. మృతురాలి కుటుంబ సభ్యులకు పిల్లలకు సీఐ మనోధైర్యాన్ని అందించారు. కాగా తమకు సరైన వసతులు లేవని, నిత్యావసరాల కోసం సమీపంలోని గ్రామానికి చేరుకోడానికి రోడ్డు లేదని స్థానికులు వాపోయారు. తమ పిల్లలు చదువుకునేందుకు బడికి వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని సరైన వసతులు కల్పించాలని కోరారు. వారి ఆవేదనను నిశితంగా విన్న సీఐ హరికృష్ణ అక్కడి స్థితిగతులను చూసి చలించిపోయారు. వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి సీఐ భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మొండెద్దుల నాగరాజ్, పసునూటి రాణప్రతాప్, వెంగళ కుమార్, తాళ్ల శ్రీధర్, దేశరాజు పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఉప సర్పంచ్ మిట్టపల్లి సుభాష్, సోను, అఖిల్, మహేందర్, అజయ్ రాకేష్, నిఖిల్ పాల్గొన్నారు.