వేద న్యూస్, శాయంపేట:
గత రెండు రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల డివిజన్ పరిధిలోని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఎలక్ట్రికల్ పోల్స్ , ట్రాన్స్ ఫార్మర్స్ ను ఎవరూ తాకరాదని, శిథిలావస్థలో ఉన్న ఇండ్ల లోనివారు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు తగ్గే వరకు తాత్కాలికంగా వేరే చోట ఉండాలని సూచించారు.
చేపలు పట్టేవారు చెరువులు నిండి ప్రమాదస్థాయిలో ఉన్నందున, చేపలు పట్టడానికి చెరువుల వద్దకు ఎవరు వెళ్లకూడదని,రోడ్లపై వరద వచ్చినపుడు వాహనదారులు అట్టి వాహనాలను రోడ్లపై దాటుటకు ప్రయత్నించకూడదని చెప్పారు. అత్యవసరం ఉంటే తప్ప ఇంట్లో నుండి ఎవరు బయటికి రాకుడదన్నారు. ఎటువంటి ఇబ్బంది కలిగిన పోలీస్ వారికి డయల్100 ద్వారా సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.