వేద న్యూస్, మరిపెడ:

త్వరలో పార్లమెంట్(లోక్ సభ) ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో మరిపెడ పట్టణంలో పోలీస్ సిబ్బంది, పారామిలిటరీ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు శుక్రవారం కవాతును నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఫంక్షన్ హాలు, రాజీవ్ గాంధీ సెంటర్ నుంచి కార్గిల్ సెంటర్ వరకు కొనసాగి..అనంతరం అక్కడ్నుంచి గెస్ట్ హౌజ్ వరకు కొనసాగింది. కవాతులో జిల్లా ఎస్పీ రామ్ నాథ్ కేకన, డీఎస్పీ సురేశ్, హత్తి రాం నాయక్, తహశీల్దారు సైదులు, మరిపెడ సర్కిల్ సీఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.