వేద న్యూస్, చొప్పదండి /రామడుగు:

ఉద్యోగి తాను విధులు నిర్వహిస్తున్న చోట అక్కడి సమస్యల పరిష్కారం లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ.. ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి మన్ననలు పొందాలని ఎస్ఐ రాజు అన్నారు.

స్థానిక ఠాణాలో ఎస్ఐ గా విధులు నిర్వహిస్తున్న జవ్వాజి రాజయ్య ఆదివారం పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్ఐ రాజు మాట్లాడుతూ ఉద్యోగం అనేది వయసుకు మాత్రమే నని, మనస్సుకు కాదని సమాజానికి చేతనైన సాయం చేస్తూ శేష జీవితం ఆయురారోగ్యాలతో గడుపాలని ఎస్ఐ ఈ సందర్భంగా ఆకాంక్షించారు.