వేద న్యూస్, నారాయణపేట:
యూరియా అడిగిన రైతు చెంప మీద ఎస్ఐ కొట్టినట్టు తెలుస్తున్న ది. యూరియా కోసం వచ్చిన రైతులపై పోలీసుల దౌర్జన్యం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అడిగిన రైతును పోలీసు చెంప మీద కొట్టిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయితున్నది.
ఈ ప్రభుత్వంలో తమకు విలువ లేదని.. యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు ఖాకీ తీరు సరికాదని, ఆ పోలీసు పై తగు చర్యలు తీసుకోవాలని పలువురు అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
