- ‘ఓగుల’ వైపు కాట్నపల్లి ప్రజల మొగ్గు
- కాట్నపల్లి గ్రామ అభివృద్ధియే ధ్యేయం: సర్పంచ్ అభ్యర్థి పూజ
వేద న్యూస్, సుల్తానాబాద్:
కష్టం విలువ తెలిసిన వ్యక్తి ఆయన.. చిన్న నాటి నుంచి పేదరికం అనుభవించిన ఓగుల రాజేందర్.. సమాజంలో సేవాభావం పెంపొందాలని కోరుతూ.. ఆ మార్గంలో ముందుకెళ్లే సద్భావన కలిగిన యువకుడు. ఈ క్రమంలోనే సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామ సర్పంచ్ బరిలో అభ్యర్థిగా ఆయన సతీమణి పూజను నిలిపారు.
వారిరువురు ప్రజాసేవలో తమ వంతు పాత్ర పోషించేందుకు నడుం బిగించారు. తనను ఆశీర్వదించి.. అవకాశమిస్తే.. అభివృద్ధి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తామని సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ వెల్లడించారు.
యువత కు అవకాశమివ్వాలి
నేటి సమాజంలో యువతకు అవకాశమిస్తేనే.. వారి ఆలోచనలు, ఆచరణ ఎలా ఉంటుందో తెలిసే అవకాశముంటుందని, ఈ నేపథ్యంలోనే తనకు గ్రామ సర్పంచ్‌గా అవకాశమివ్వాలని సర్పంచ్ అభ్యర్థి పూజ కోరుతున్నారు.
విద్యావంతులు, సమాజంలో సేవాభావం పెంపొందించేందుకు, నిజమైన ప్రజా సేవలో ముందుకెళ్లాలనే భావన కలిగిన తమకు అవకాశమిస్తే.. తాము ఎలా పని చేస్తామో.. చేసి చూపిస్తామని ఓగుల పూజ రాజేందర్ తెలిపారు.
కాట్నపల్లి గ్రామ ప్రజల సంక్షేమం, అభివృద్ధి దిశగా తమ అడుగులు ఉంటాయని, అవినీతికి తావు లేకుండా పరిపాలన అందిస్తామని హామీనిస్తున్నారు. తాము పేదరికం నుంచి వచ్చిన వారమని, పేదరికం విలువ తెలిసిన మనుషులం కాబట్టి.. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించేందుకు .. చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వెల్లడించారు.
ప్రభుత్వం దృష్టికి, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఏ విషయాన్ని అయినా తీసుకెళ్లే చొరవ, శక్తి సామర్థ్యాలు తమకు ఉన్నాయని చెప్పారు.
తమను కాట్నపల్లి గ్రామ ప్రజలు నిండుగా, మెండుగా ఆశీర్వదించి.. ఓటు రూపంలో తమ దీవెనలు అందించి.. సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలపించాలని ఓగుల పూజ రాజేందర్ కాట్నపల్లి గ్రామ ప్రజలను వినమ్రంగా వేడు కుంటున్నారు.