• లంభోదరుడికి పూజ కోసం ఏకంగా పూజారిని ఎత్తుకెళ్లారు!
  • పూజారిని చుట్టుముట్టి బైక్ పై ఎత్తుకెళ్లిన నిర్వాహకులు !

వేద న్యూస్, సిద్దిపేట:

సిద్దిపేట జిల్లా కోహెడలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. గణేశ్ మండపాల్లో పూజ కోసం పూజారుల కొరత తీవ్రంగా ఉండటంతో రెండు మండపాల నిర్వాహకులు ఒకే పూజారి కోసం పోటీ పడ్డారు.

తమ మండపంలోని గణపతికే ముందుగా పూజ చేయాలంటూ ఓ మండపం నిర్వాహకులు ఆ పూజారిని బైకుపై తీసుకెళ్లిపోయారు.

ఈ వింత ఘటన చూసి స్థానికులు ఆశ్చర్య పోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా, పూజారిని ఇలా బైక్ పై తీసుకెళ్తుండటం చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదెంటీ? పూజారిని కూడా ఇలా.. తీసుకెళ్తారా? అని అనుకుంటున్నారు.